‘వార్ 2’ పై ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్

‘వార్ 2’ పై ఎన్టీఆర్ ఫుల్ ఫోకస్

Published on Jul 23, 2024 10:00 AM IST

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఐతే, ఆగష్టు నుంచి ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వరుసగా డేట్స్ ఇస్తాడని తెలుస్తోంది. నవంబర్ లోపు సినిమాలో తన పార్ట్ ను తారక్ శరవేగంగా పూర్తి చేస్తాడని అంటున్నారు. అలాగే వచ్చే నెల రెండో వారం నుంచి ‘వార్ 2’ ఇంటర్వెల్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో హృతిక్ రోష‌న్‌ – ఎన్టీఆర్ లతో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటారని టాక్ నడుస్తోంది.

ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘వార్ 2’ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అన్నట్టు ‘వార్ 2’ కథ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్ పాత్రకు దీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట. పైగా ‘వార్ 2’ అనేది యాక్షన్ ఫిల్మ్. మరి యాక్షన్ ఫిల్మ్ లో ఎన్టీఆర్ ఏ రేంజ్ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి. నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు