వారి కోసమే నటించాను – విజయ్ దేవరకొండ

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రస్తుతం భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఐతే, ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో నటించి మెప్పించాడు. తన పాత్ర పై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘కల్కి’ సినిమాలో ప్రభాస్, నాగ్ అశ్విన్ కోసమే నేను నటించాను. వారంతా నాకు ఇష్టమైన వ్యక్తులు. ప్రభాస్ VS విజయ్ అంటూ ఏమీ లేదు, నాగీ యూనివర్స్‌లో కర్ణుడు, అర్జునుడు పాత్రల్లో మేం నటించాము’ అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

ఇక కల్కి పార్ట్-2లో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుందా ?, ఉంటే ఎలా ఉండబోతుంది ?, అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారతీయ సినీ పరిశ్రమలోనే భారీ సినిమాగా ఈ చిత్రం నిలిచింది. ఇక ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్‌గా కమల్‌హాసన్ అద్భుతంగా నటించారు.

Exit mobile version