రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా అని ప్రచారం జరుగుతుంది. దీంతో, రోజురోజుకు ఈ సినిమా పై రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
మరి, ఆలియా భట్, నిజంగానే మహేష్ బాబు సరసన నటిస్తే.. ఆ క్రేజే వేరు. ఇక ఈ సినిమాలో మహేష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కాగా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ కథా నేపథ్యం సాగుతుందట. ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కానీ రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.