వారసుడి సినిమా పై బాలయ్య క్రేజీ కామెంట్స్

ఐఫా అవార్డ్స్ కు హాజరు అయిన బాలయ్య బాబు, తన వారసుడు మోక్షజ్ఞ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ బాలయ్య ఏం మాట్లాడారు అంటే.. ‘ఐఫా సెలబ్రేషన్స్ లో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సదరు యాంకర్
‘మీ వారసుడు సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది ? అని ప్రశ్నించగా… మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్ లో లాంచ్ చేస్తున్నాం’ అని బాలయ్య కామెంట్స్ చేశారు.

కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ మొదటి సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ లోనే ఈ ప్రాజెక్ట్ కూడా ఉండబోతుంది. అంటే.. ఇండియన్ మైథాలజీలో ఉన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని ఓ సూపర్ హీరో కథతో ఈ సినిమా ఉంటుందట. మొత్తమ్మీద నందమూరి అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version