‘స్పిరిట్‌’లో ప్రభాస్ సరికొత్త లుక్స్ ?

‘స్పిరిట్‌’లో ప్రభాస్ సరికొత్త లుక్స్ ?

Published on Jun 17, 2024 10:01 PM IST

యానిమల్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి పాన్ ఇండియా దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఐతే, ప్రస్తుతం ఈ దర్శకుడు ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఐతే, ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. అందులో ఒకటి పక్కా మాస్ లుక్‌ అని, ఆ లుక్ లో ప్రభాస్ నిజంగా ప్రేక్షకులకు షాక్ ఇస్తాడని అంటున్నారు. పూర్తిగా రఫ్ అండ్ రగ్గుడ్ లుక్ తో ప్రభాస్ సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట.

అన్నట్టు మరో లుక్ విషయానికి వస్తే.. ప్రభాస్ రెండో లుక్ సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో ఉంటుందట. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అన్నట్టు ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉంటుందట. ఇప్పటికే, 70 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. రూ.300 కోట్లకు పైగా బడ్జెట్‌ తో ఈ సినిమా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు