‘పుష్ప 2’లో మరో అతిధి పాత్ర ?

‘పుష్ప 2’లో మరో అతిధి పాత్ర ?

Published on Mar 4, 2024 9:00 AM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, పుష్ప 2: ది రూల్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రూమర్లు వినిపించాయి. తాజాగా మరో రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో స్టార్ హీరో అతిధి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్రను ప్లాన్ చేశారని టాక్ నడుస్తోంది. సంజయ్ దత్ డాన్ కనిపిస్తాడట.

అయితే, ఈ వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పైగా ఈ పుష్ప సీక్వెల్‌ లో కొన్ని కీలక పాత్రలతో పాటు పలు కొత్త పాత్రలు కూడా ఈ పుష్ప 2లో పరిచయం కానున్నాయి. అందుకే, ‘పుష్ప 2’ కోసం ఫ్యాన్స్ రెట్టింపు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించింది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఆగస్టు 15న, 2024లో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు