నితిన్ సినిమాలో హిలేరియ‌స్‌ ట్రాక్

నితిన్ సినిమాలో హిలేరియ‌స్‌ ట్రాక్

Published on Oct 24, 2023 3:01 AM IST

‘ఛలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో – నితిన్ హీరోగా మరో సినిమా వస్తోంది. ఈ సినిమా యాక్షన్ జోన‌ర్‌ లో న‌డిచే క‌థ అయినప్పటికీ.. కామెడీ మాత్రం హిలేరియ‌స్‌ గా ఉంటుందట. అందుకోసం సీనియర్ హాస్య నటుడు బ్రహ్మానందం కోసం ఓ ప్రత్యేక కామెడీ ట్రాక్ ను వెంకీ కుడుముల డిజైన్ చేశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్ – బ్రహ్మానందం మధ్య వచ్చే సీన్సే చాలా ఎంటర్ టైన్ గా ఉంటాయని తెలుస్తోంది. పైగా చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఈ సినిమాలో ఫుల్ కామెడీ పాత్రలో కనిపించబోతున్నారు.

మొత్తానికి, ‘ఛలో ‘భీష్మ సినిమాలోని ఫన్ కంటే ఈ సినిమాలో ఫన్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ తారాగణంతో భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఎలాగూ భీష్మ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ కుడుముల – నితిన్ సినిమా పై ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమాతో ఈ హిట్ కాంబినేషన్ ఏ రేంజ్ హిట్ ను కొడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు