నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన రీసెంట్ సూపర్ హిట్ చిత్రం “సరిపోదా శనివారం”. మరి రిలీజ్ కి ముందు సెట్ చేసుకున్న బజ్ ని మ్యాచ్ చేస్తూ అంతకు మించిన హిట్ గానే ఈ సినిమా నిలిచి అదరగొట్టింది. అంతే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం ఏకంగా నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి దుమ్ము లేపింది.
అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ చిత్రం ఓటిటి ఎంట్రీ ఈ సెప్టెంబర్ 27న అలా ఉంటుంది అని బజ్ వచ్చింది. కానీ ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది అని చెప్పాలి. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ సెప్టెంబర్ 26 నుంచి తమ స్ట్రీమింగ్ యాప్ లో పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఖరారు చేసేసారు. మరి ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి.
Ippati dhaaka @NameisNani rendu kaalle choosaru… moodo kannu choodataniki meeru ready ah?#SaripodhaaSanivaaram is coming to Netflix on 26th September in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi!#SaripodhaaSanivaaramOnNetflix pic.twitter.com/b0CrfvMb94
— Netflix India South (@Netflix_INSouth) September 21, 2024