లేటెస్ట్ : త్రివిక్రమ్ పై పవన్ నుంచి ఊహించని ఆసక్తికర కామెంట్స్

లేటెస్ట్ : త్రివిక్రమ్ పై పవన్ నుంచి ఊహించని ఆసక్తికర కామెంట్స్

Published on Mar 14, 2024 4:13 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) ఇప్పుడు తన సినిమాలకి తాత్కాలికంగా విరామం ఇచ్చి పూర్తిగా పాలిటిక్స్ పనుల్లోనే బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలా లేటెస్ట్ గా తన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి కావాల్సిన జోష్ ని అంతా నింపాడు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన పలు కామెంట్స్ లో తన సన్నిహితుడు టాలీవుడ్ స్టార్ దర్శకుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

వీటిలో కొన్ని ఊహించని అంశాలు కూడా పవన్ రివీల్ చేయడం ఆసక్తిగా మారింది. తన దగ్గర డబ్బులు లేని సమయంలో పార్టీని ఎలా నడపాలి అనే మీమాంసలో ఉన్నపుడు తన స్నేహితుడు సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వెన్నంటే ఉన్నందుకు తనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. అలాగే తనకి అలాంటి సమయంలో “వకీల్ సాబ్” అనే చిత్రాన్ని తన దగ్గరకి త్రివిక్రమే తీసుకొచ్చారని, అలా మూడు నాలుగు సినిమాలు చేసానని తెలిపాడు.

అయితే తనకి నేను రాజకీయాల్లోకి వెళ్లడం అసలు ఇష్టం లేదని అందుకే నా వ్యథ భరించలేక అప్పుడు “జల్సా” సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ లోని నా మనసులోని మాటలు అన్నీ డైలాగ్స్ గా రాసి సినిమాలో అయినా చేస్తే ఆగిపోతాడేమో అనుకున్నాడని కానీ నేను అక్కడ నుంచి మరింత పెట్రేగిపోయానని చమత్కరించారు. అలాగే నేను సమాజం కోసం ఆలోచిస్తే త్రివిక్రమ్ నా కోసం ఆలోచిస్తాడని పవన్ ఆసక్తికర అంశాలు పంచుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు