మాస్ పోస్టర్ తో ‘పెద్ది’ గ్లింప్స్ డేట్ వచ్చేసింది!

మాస్ పోస్టర్ తో ‘పెద్ది’ గ్లింప్స్ డేట్ వచ్చేసింది!

Published on Mar 30, 2025 4:02 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో చేస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే చరణ్ పుట్టినరోజు కానుకగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇక ఈ పోస్టర్స్ తోనే సినిమా గ్లింప్స్ కూడా వస్తుంది అని గట్టి బజ్ వినిపించింది కానీ పలు కారణాలు రీత్యా రాలేదు. ఇక నేడు ఉగాది కానుకగా ఈ గ్లింప్స్ వస్తుంది అని మళ్ళీ వార్తలు వినిపించాయి.

అయితే నేడు గ్లింప్స్ రాలేదు కానీ ఒక అదిరే పోస్టర్ తో గ్లింప్స్ ఎప్పుడు వస్తుందో మేకర్స్ డేట్ ని ఇచ్చేసారు. జెండాలు పట్టుకొని కొందరు గుంపు ఉంటే వారి మధ్యలోకి దూకుతున్న చరణ్ ఇందులో కనిపిస్తున్నాడు. దీనితో ఈ పోస్టర్ ఇపుడు అభిమానులకి మంచి కిక్ ఇవ్వగా ఈ పోస్టర్ తోనే మేకర్స్ ఈ శ్రీరామ నవమి కానుకగా ఈ ఏప్రిల్ 6న ఫస్ట్ షాట్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు