లేటెస్ట్ : రవితేజ “టైగర్ నాగేశ్వర రావు” రిలీజ్ డేట్ ఫిక్స్.!

లేటెస్ట్ : రవితేజ “టైగర్ నాగేశ్వర రావు” రిలీజ్ డేట్ ఫిక్స్.!

Published on Mar 29, 2023 12:06 PM IST

ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆల్రెడీ రెండు సాలిడ్ హిట్స్ అందుకున్న తాను ఇప్పుడు రావణాసుర తో అయితే హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తున్నారు. ఇక తన నుంచి అయితే మొట్ట మొదటగా భారీ స్కేల్ లో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వర రావు” తో అయితే తాను పాన్ ఇండియా లెవెల్లో అడుగు పెట్టబోతున్నారు.

మరి ఈ సినిమాని దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తుండగా భారీ హంగులతో దీనిని ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ సినిమా నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అయితే గ్రాండ్ గా ఈ అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ని ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో అయితే ఈ ఏడాదిలో మాస్ మహారాజ్ నుంచి మూడో సినిమా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో రేణు దేశాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు