లేటెస్ట్ : ‘బిగ్ బాస్ – 7’ గ్రాండ్ ఫినాలే కి రికార్డు రేంజ్ లో రేటింగ్


ఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో యొక్క 7 వ సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలవగా రన్నరప్ గా అమరదీప్ నిలిచారు.

అయితే విషయం ఏమిటంటే, ఆ రోజున ప్రసారమైన గ్రాండ్ ఫినాలే కి ఏకంగా 21. 7 TVR (టెలివిజన్ వ్యూ రేటింగ్) లభించిందని, ఒకరకంగా ఇది పెద్ద రికార్డు అని, ఇంతటి ఆదరణ తమ షో కి అందించిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ స్టార్ మా ఛానల్ వారు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఒక పోస్ట్ చేశారు. ఇక రాబోయే బిగ్ బాస్ 8 ని వారు మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version