మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా రిలీజ్ అయితే ఇప్పుడు వాయిదా పడినట్టుగా రూమర్స్ వచ్చాయి. ఇక దీనితో ఈ సినిమా కాస్త జూన్, జూన్ నుంచి ఆగస్ట్ కి వెళ్లింది అని టాక్ వచ్చింది.
అయితే ఆగస్ట్ లో ఉన్న పుష్ప 2 రిలీజ్ వెనక్కు వెళ్లడం లేదని మేకర్స్ కన్ఫర్మ్ చేయడంతో దేవర మరో డేట్ లోకి వెళ్లినట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ చిత్రం దసరా బరిలో రిలీజ్ అవుతుంది అంటూ సరికొత్త పుకారు మొదలైంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలయికలో నిర్మాణం వహిస్తున్నారు.