ఎన్టీఆర్ తో తన సినిమా షూటింగ్ ప్లాన్ లో ఉన్నాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నెల రోజుల్లో మొదలవుతుందని టాక్. ఎలాగూ 2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి.. ప్రశాంత్ నీల్ ఫోకస్ మొత్తం ఈ సినిమా పైనే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో “కేజీఎఫ్ చాప్టర్ 3” కూడా వచ్చే ఏడాది ఎండింగ్ లో మొదలు అవుతుందని తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది.
ఆ మధ్య హోంబలే ఫిలిమ్స్ అధినేత కేజీఎఫ్ సిరీస్ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ఇదే విషయం గురించి క్లారిటీ ఇస్తూ.. “కేజీఎఫ్ చాప్టర్ 3” స్టోరీ కూడా రెడీ అయిపోయిందని.. 2025 చివర్లో ఈ సినిమా షూట్ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఐతే, ఎన్టీఆర్ సినిమాతో పాటు “సలార్ 2” మూవీని ప్రశాంత్ నీల్ పూర్తి చేయాల్సి ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్స్ లో ప్రశాంత్ నీల్ “కేజీఎఫ్ చాప్టర్ 3”ని వచ్చే ఏడాది మొదలు పెడతాడా ? డౌటే. ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం కేజీఎఫ్ సిరీస్ ఫ్యాన్స్ కి పండగే.