వెంకీ సినిమాలో బాలీవుడ్ స్టార్ ?

వెంకీ సినిమాలో బాలీవుడ్ స్టార్ ?

Published on Sep 9, 2024 8:00 AM IST

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ లో వెంకీ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఐతే, తాజాగా ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందట. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ స్టార్ ‘సల్మాన్ ఖాన్’ అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

రీసెంట్ గా పొల్లాచ్చిలో ఈ సినిమా షెడ్యూల్ జరిగింది. భాను మాస్టర్ కొరియోగ్రఫీ లో వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ ల పై ఓ సాంగ్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ లో భార్యభర్తలుగా వెంకటేష్ – ఐశ్వర్య రాజేష్ కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు