‘కార్తికేయ – 2 ‘ హీరోయిన్ పై క్లారిటీ ?

Published on Jul 12, 2020 1:06 am IST


యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి డైరెక్షన్ లో యంగ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘కార్తికేయ – 2 ‘ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమా నుండి తప్పుకుందని దాంతో చిత్రబృందం ఈ సినిమా హీరోయిన్ గా ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి.

మరి ఈ రూమర్స్ పై అలాగే తమ సినిమాలో హీరోయిన్ పై చిత్రబృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ఓ కొత్త కాస్పెక్ట్ హైలెట్ అవునున్నాయట. ఎలాగు ‘కార్తికేయ’ సినిమాతోనే డైరెక్టర్ గా మంచి డిమాండ్ తెచ్చుకున్న చందు.. మళ్ళీ నిఖిల్ తో ‘కార్తికేయ 2’ తీసి… తిరిగి మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More