క్రేజీ..థియేటర్స్ లో “సర్కారు వారి” కొత్త ట్రీట్ ఎప్పుడు నుంచి అంటే..!

Published on May 27, 2022 7:59 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురాం పెట్ల కాంబినేషన్లో తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో మరో హ్యాట్రిక్ హిట్స్ కి నాంధి పలికింది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఆడియెన్స్ మరియు అభిమానులు కి గట్టి ట్రీట్ ఇచ్చే అంశాలు చాలానే ఉండగా ఇప్పుడు అడిషనల్ ట్రీట్ ని మేకర్స్ యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో ఆల్రెడీ ఒక సాంగ్ మురారి బావ చేసాం కానీ దాన్ని రిలీజ్ తో యాడ్ చేయలేదని దర్శకుడు పరశురాం అప్పుడు ప్రమోషన్స్ లో కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఆ సాంగ్ ని జత చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి అది కూడా రేపటి నుంచే అట. అంటే ఈ మే 28 నుంచి ఈ కొత్త సాంగ్ తో సర్కారు వారి పాట కొత్త ట్రీట్ ఉండబోతుంది అని చెప్పాలి. మరి థమన్ ఇచ్చిన ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి అంటే మరోసారి ఈ సినిమా షో వెయ్యాల్సిందే.

సంబంధిత సమాచారం :