‘అఖండ 2 – తాండవం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

‘అఖండ 2 – తాండవం’ పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Mar 16, 2025 2:01 AM IST

నటసింహం బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కాగా ప్రస్తుతం హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో బాలయ్య అఘోర పాత్ర పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. అయితే, ఈ సీన్స్ షూట్ పూర్తి అయ్యాక, వచ్చే షెడ్యూల్ ను కర్నూలులో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య రెండో పాత్ర పై ఈ సీన్స్ ను షూట్ చేస్తారట. ఈ సీన్స్ కోసం అక్కడ ఓ సెట్ కూడా వేస్తారని తెలుస్తోంది.

అన్నట్టు, కర్నూలులో జరిగే షెడ్యూల్ లో బాలయ్యతో పాటు జగపతి బాబు, అలాగే విలన్ పాత్రధారి కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్‌ లో హ్యాట్రిక్ విజయాలు నమోదయ్యాయి. దీంతో ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు