మరోసారి అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై సాలిడ్ బజ్

మరోసారి అట్లీ, అల్లు అర్జున్ ప్రాజెక్ట్ పై సాలిడ్ బజ్

Published on Sep 15, 2024 12:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రస్తుతం అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” (Pushpa 2 The Rule) చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత కూడా అల్లు అర్జున్ నుంచి మాసివ్ లైనప్ సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రాల్లో గత కొన్నాళ్ల నుంచి కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీతో చేసే సినిమా కూడా ఒకటి అని టాక్ ఉంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ వార్తల్లోకి వచ్చింది. దీనితో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారు అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రాన్ని బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ టి సిరీస్ వారు అలాగే మన టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కలయికలో నిర్మాణం వహించబడుతుంది అని టాక్. ఇక త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి కూడా అనిరుద్ నే సంగీతం అందించనున్నాడట. మరి ప్రస్తుతం ఈ అవైటెడ్ కాంబినేషన్ పై ఓ క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు