“విశ్వంభర” టీజర్ పై సాలిడ్ బజ్!

“విశ్వంభర” టీజర్ పై సాలిడ్ బజ్!

Published on Sep 12, 2024 12:13 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ ఫాంటసీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి మెగా అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రం నుంచి టీజర్ ని కూడా మేకర్స్ ఈ మధ్యనే విడుదల చేయాల్సి ఉంది కానీ ఆ ప్లాన్ మారింది.

అయితే ఫైనల్ గా ఈ సినిమా టీజర్ కట్ కి రంగం సిద్ధం అయ్యినట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ భారీ సినిమా టీజర్ ని మేకర్స్ ఈ దసరా మహోత్సవ కానుకగా విడుదల చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది అని టాక్. మరి చాలా కాలం తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ సినిమా ఇది కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మరి వశిష్ఠ ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కించాడో తెలియాలి అంటే వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు