Devara Trailer: “దేవర” రెండో ట్రైలర్ పై సాలిడ్ బజ్

ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న భారీ చిత్రం “దేవర” అనే చెప్పాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ బిగ్గెస్ట్ విజన్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మరి ఈ సినిమా నుంచి మొదటిగా వచ్చిన ట్రైలర్ నెగిటివ్ ని కూడా ఇపుడు పూర్తి పాజిటివ్ గా మార్చుకొని దేశ వ్యాప్తంగా భారీ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. అయితే దీని తర్వాత దేవర నుంచి రెండో ట్రైలర్ వస్తుంది అని ఇది వరకే రూమర్స్ ఉన్నాయి.

అయితే ఈ రెండో ట్రైలర్ పై ఇప్పుడు సాలిడ్ బజ్ వినిపిస్తుంది. మరి మేకర్స్ ఈ రెండో ట్రైలర్ ని రేవు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయనున్నట్టుగా వినిపిస్తుంది. దీనితో తారక్ ఫ్యాన్స్ కి ప్రీ రిలీజ్ లోనే మరో బిగ్గెస్ట్ బ్లాస్ట్ సిద్ధంగా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version