“భారతీయుడు 2” రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ

“భారతీయుడు 2” రిలీజ్ పై సాలిడ్ క్లారిటీ

Published on Jun 18, 2024 10:00 AM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా యంగ్ హీరో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం తెలుగులో “భారతీయుడు 2” గా రాబోతుంది. అయితే ఈ చిత్రం నిజానికి ఈ జూన్ లోనే రిలీజ్ కావాల్సింది కానీ మేకర్స్ జూలై కి వాయిదా వేశారు. అయితే జూలై లో కూడా ఈ సినిమా డౌట్ అంటూ కొన్ని ఊహాగానాలు ఇటీవలే మొదలయ్యాయి.

అయితే దీనిపై ఓవర్సీస్ మార్కెట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం థియేటర్స్ లో జూలై 12 నుంచే వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. సో ఇండియన్ 2 రాకలో ఎలాంటి అనుమానం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య అలాగే బ్రహ్మానందం, దివంగత నటుడు వివేక్ తదితరులు నటించారు. అలాగే అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు