చైనాలో “మహారాజ” లేటెస్ట్ సాలిడ్ వసూళ్లు..

చైనాలో “మహారాజ” లేటెస్ట్ సాలిడ్ వసూళ్లు..

Published on Dec 27, 2024 8:03 AM IST

కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా యంగ్ దర్శకుడు నిథిలన్ సామినాథన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ రివెంజ్ థ్రిల్లర్ చిత్రం “మహారాజ”. మరి తెలుగు సహా తమిళ్ లో మంచి హిట్ అయ్యిన ఈ చిత్రం విజయ్ సేతుపతి కెరీర్లో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న చిత్రంగా ఇది నిలిచింది.

అయితే ఈ చిత్రం మన దగ్గర సెన్సేషనల్ రన్ తర్వాత అలాగే ఓటిటిలో కూడా భారీ రెస్పాన్స్ ని అందుకున్న ఈ చిత్రం లేటెస్ట్ గా చైనా మార్కెట్ లో రిలీజ్ కి వచ్చింది. అయితే అక్కడ నాలుగు వారాలు రన్ ని కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమా అక్కడ తన కంప్లీట్ హైయెస్ట్ ని కొట్టేసేలా ఉందని చెప్పాలి.

మొదట ఇండియన్ రిలీజ్ లో 100 కోట్లకి పైగా రాబట్టిన ఈ చిత్రం ఇపుడు ఒక్క చైనా మార్కెట్ నుంచే ఇంకో 100 కోట్ల దిశగా వెళుతుంది. లేటెస్ట్ కోలీవుడ్ పి ఆర్ లెక్కల ప్రకారం 91.5 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో మహారాజ చిత్రం అక్కడ 100 కోట్ల మార్క్ కి దూసుకెళ్తుంది అని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు