బాలయ్య, బోయపాటి ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్ వచ్చేసింది.!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ అండ్ సెన్సేషనల్ మాస్ కాంబినేషన్ లలో నందమూరి బాలకృష్ణ అలాగే మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి కలయికలో వచ్చిన మూడు సినిమాలు కూడా సంచలన విజయాలు సాధించి ఊహించని లాంగ్ రన్ ని కూడా అందుకున్నాయి. ఇలా ఈ సెన్సేషనల్ హ్యాట్రిక్ కాంబో నాలుగో సినిమాకి సన్నద్ధం అయ్యింది.

కొన్నాళ్ల కితమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ చిత్రంపై నేడు విజయ దశమి కానుకగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని అయితే అందించారు. మరి ఈ సినిమాకి బ్రహ్మ ముహుర్తాన్ని ఈ అక్టోబర్ 16 ఉదయం 10 గంటలకి ఖరారు చేసినట్టుగా సినిమా ముహుర్తాన్ని ప్రకటించేసారు. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆరోజున మొదలు కానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా ప్రముఖ నిర్మాణం సంస్థ 14 రీల్స్ ప్లస్ వారు ఈ క్రేజీ కలయికను భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

Exit mobile version