టాలీవుడ్ స్టార్ యాక్టర్ మాస్ మహారాజా రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ ఈగిల్. ఈ మూవీలో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించగా విలన్ గా వినయ్ రాయ్ కనిపించనున్నారు. అయితే సంక్రాంతి కి రిలీజ్ కావాల్సిన ఈ మూవీని ఫిబ్రవరి 9 కి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
కాగా అదే రోజున సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన కూడా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో ఈగిల్ నిర్మాతలు ఫిలిం ఛాంబర్ నిర్మాతల మండలిని ఆశ్రయించారు. నిజానికి తమకు సోలో రిలీజ్ అందిస్తారని భరోసాతోనే సంక్రాంతి రేస్ నుండి తాము తప్పుకున్నామని ఈగిల్ నిర్మాతలైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు చెప్పడం జరిగింది. దానితో ఈ విషయమై నేడు ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశంలో నిర్మాతలు అందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈగిల్ నిర్మాతలకు ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ ఇచ్చి, ఊరు పేరు భైరవకోన నిర్మాతలను ఒక వారం వెనక్కు అనగా ఫిబ్రవరి 16న విడుదల చేసుకోమని కోరినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫిబ్రవరి 16న రిలీజ్ అనౌన్స్ చేసిన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్, గోపీచంద్ భీమా సినిమాలు రెండూ కొన్నాళ్ళు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై నేడు పక్కాగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.