“గేమ్ చేంజర్” రిలీజ్ డేట్ ఇదే?

“గేమ్ చేంజర్” రిలీజ్ డేట్ ఇదే?

Published on Feb 28, 2024 11:09 AM IST

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి కియారా అద్వానీ, అంజలి లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రాన్ని శంకర్ మళ్ళీ తన వింటేజ్ మార్క్ పొలిటికల్ అండ్ యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా శంకర్ ఫ్యాన్స్ లో కూడా ఈ సినిమా పట్ల మంచి హైప్ ఉంది.

కానీ ఒక్క డిజప్పాయింటింగ్ అంశం ఏమిటంటే ఈ చిత్రం స్టార్ట్ చేసి ఇన్నేళ్ళైనా కూడా ప్రాపర్ అప్డేట్స్ కానీ రిలీజ్ డేట్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటకి రాలేదు. అయితే ఈ మార్చ్ లో చరణ్ బర్త్ డే ఉంది కాబట్టి అప్పుడు కొన్ని అంశాలు క్లారిటీ రావచ్చని టాక్ ఉంది.

ఇక ఈ లోపు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్ ఒకటి బయటకి వచ్చింది. దీని ప్రకారం మేకర్స్ ఈ చిత్రాన్ని ఏకంగా ఈ ఏడాది చివరికి క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయడానికి లాక్ చేశారట. డిసెంబర్ 25 లాంగ్ వీకెండ్ తో గేమ్ చేంజర్ రాబోతుంది అని ఇప్పుడు టాక్. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు