Suriya 44: తన క్రేజీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేసిన సూర్య..

Suriya 44: తన క్రేజీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసేసిన సూర్య..

Published on Oct 6, 2024 9:07 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య చేసిన భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమా కాకుండా తాను తన కెరీర్ 44వ చిత్రాన్ని ఒక కామెడీ, గ్యాంగ్ స్టర్ లవ్ డ్రామాని టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సూర్య ఊహించని అప్డేట్ ని అందించాడు.

కంగువా పూర్తి చేసి ఇందులోకి వచ్చాడో లేదో ఆ సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే ఈ సినిమాని పూర్తి చేసేసినట్టుగా రివీల్ చేసాడు. దీనితో తన చిత్ర యూనిట్ దర్శకుడితో కలిపి ఉన్న ఫోటోలు షేర్ చేసి సినిమా షూటింగ్ మెమోరీస్ ని నెమరు వేసుకుంటూ ఆనందం వ్యక్తం చేసాడు. దీనితో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో సూర్య సరసన పూజా హెగ్డే నటించగా 2డి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు