నలుగురు హీరోయిన్స్.. యూత్ కి మంచి కిక్ ఇచ్చేలా.. !

నలుగురు హీరోయిన్స్.. యూత్ కి మంచి కిక్ ఇచ్చేలా.. !

Published on Mar 28, 2019 9:25 PM IST

ఇప్పటి సినిమాల్లో ఒక హీరోయిన్ ఉంటేనే.. హద్దులు మీరి మరి తన అందాలతో కనువిందు చేస్తారు మన భామలు. మరి ఏకంగా నలుగురు హీరోయిన్లు ఉంటే.. ఇక అందాల ఆరబోతకు హద్దు అదుపు ఏమి ఉంటుంది. ఇంతకీ విషయంలోకి వెళ్తే.. సిద్ధి ఇద్నాని, ధ‌న్య బాల‌కృష్ణ‌, త్రిదా చౌద‌రి, కొమ‌లి ప్ర‌సాద్ ప్రధాన పాత్రల్లో బాలు ద‌ర్శక‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది.

సినిమా పాయింట్ తో పాటు.. సినిమాలో మ్యాటర్ కూడా యూత్ కి మంచి కిక్ ఇచ్చేలానే ఉంటుందట. హైదరాబాద్ లో నివసించే స్వ‌తంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. స్వ‌తంత్య్ర భావాలు అంటే ఇక ప్రత్యేకంగా చెప్పాలా.. యూత్ ని టార్గెట్ చేసే అంశాలే. అయితే కామెడీ కూడా ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో క‌థానుగుణంగా ఉండే ట్విస్ట్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయట.

కాగా త్వరలో జరగబోయే కీలక షెడ్యూల్ లో క్లైమాక్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీక‌రించనుంది చిత్రబృందం. హిమ బిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి మే నెల‌లో సినిమాను విడుద‌ల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు