లేటెస్ట్ : పవర్ఫుల్ టైటిల్, గ్లింప్స్ తో ‘తలైవర్ 170’

లేటెస్ట్ : పవర్ఫుల్ టైటిల్, గ్లింప్స్ తో ‘తలైవర్ 170’

Published on Dec 12, 2023 6:14 PM IST

ఇటీవల యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన జైలర్ మూవీతో కెరీర్ పరంగా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైభీమ్ దర్శకుడు టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న కెరీర్ 170వ మూవీకి నేడు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేసారు మేకర్స్. నేడు రజిని పుట్టినరోజు పురస్కరించుకుని వీటిని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీకి వేటైయాన్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

ఇక గ్లింప్స్ లో రజినీకాంత్ పవర్ఫుల్ స్టైల్ లో లాఠీ పట్టుకుని నడుచుకుంటూ రావడం, స్టైలిష్ గా కళ్లద్దాలు పెట్టుకోవడం, అనంతరం వేట మొదలైంది అంటూ డైలాగ్ చెప్పడం చూడవచ్చు. దీని ప్రకారం ఈ మూవీలో రజినీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాసిల్, దగ్గుబాటి రానా, మంజు వారియర్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న వేటైయాన్ మూవీకి అనిరుద్ సంగీతం అంధిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు దీనిని గ్రాండియర్ లెవెల్లో నిర్మిస్తున్నారు. కాగా ఈ యాక్షన్ మూవీ పక్కాగా వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చే ఛాన్స్ కనపడుతోంది.

ఫుల్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు