అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “తండేల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన సినిమా భారీ వసూళ్లు అందుకొని నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడమే కాకుండా తనకి సెన్సేషనల్ కం బ్యాక్ సినిమాగా కూడా నిలిచింది.
ఇక ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటిటిలో సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. మేము చెప్పినట్టుగానే ఈ మార్చ్ 7 న తండేల్ స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రాన్ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా వారు ఇపుడు ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో ఈ మార్చ్ 7 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ఈ సినిమా కోసం చూస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా బన్నీ వాసు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.