అఫీషియల్ “బిగ్ బాస్ 8” లోగో వచ్చేసింది.. ఈసారి హోస్ట్?

అఫీషియల్ “బిగ్ బాస్ 8” లోగో వచ్చేసింది.. ఈసారి హోస్ట్?

Published on Jul 21, 2024 2:03 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ దగ్గర ఒక గేమ్ ఛేంజింగ్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్” అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా అలాగే ఇండియాలో కూడా పెద్ద హిట్ అయ్యిన ఈ షో మన తెలుగులో కూడా అపారమైన ఆదరణ సొంతం చేసుకుంది. అయితే మన తెలుగులో మాత్రం ఇండియా లోనే బిగెస్ట్ రేటింగ్ రెస్పాన్స్ నమోదు కావడంతో మన తెలుగులోనే సినిమా పెద్ద హిట్ అయ్యింది.

ఇప్పటి వరకు 7 సీజన్లను సక్సెస్ ఫుల్ గా తెలుగులో కంప్లీట్ చేసుకోగా అంతా సీజన్ 8 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎట్టకేలకి బిగ్ బాస్ 8 పై స్టార్ వారు అఫీషియల్ అప్డేట్ ఇచ్చేసారు. ఈసారి ఇంట్రెస్టింగ్ టైటిల్ లోగో డిజైన్ చేసి అదరగొట్టారు. అంతే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మరింత ట్రెండీ బీట్స్ తో మణిశర్మ అదరగొట్టారు. అయితే ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునే కొనసాగానున్నట్టుగా కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇక ముందు రోజుల్లో అయితే బిగ్ బాస్ సీజన్ 8 పై మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రానున్నాయి అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు