లేటెస్ట్: తారక్ పై ఇంటెన్స్ పోస్టర్ తో ఆయుధ పూజ సాంగ్ కి టైం ఫిక్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఆమెతో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ టాలీవుడ్ కి పరిచయం అవుతూ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ నే “దేవర”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం తాలూకా మ్యూజిక్ ఆల్బమ్ కూడా మంచి హిట్ అయ్యింది. అయితే ఈ ఆల్బమ్ లో ఎప్పుడు నుంచో ఊరిస్తున్న క్రేజీ నెంబర్ ఆయుధ పూజపై ఫైనల్ గా మేకర్స్ అప్డేట్ ఇచ్చేసారు.

మరి ఈ సాంగ్ ని రేపు సెప్టెంబర్ 19న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా తారక్ పై ఇంటెన్స్ లుక్ లో చూస్తున్న పోస్టర్ తో క్లారిటి ఇచ్చారు. దీనితో ఈ సాంగ్ కోసం ఇపుడు అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ సాంగ్ ని అనిరుద్ ఏ లెవెల్లో అందించాడో అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించగా ఈ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా “దేవర” భారీ రిలీజ్ కాబోతుంది.

Exit mobile version