లేటెస్ట్.. “గేమ్ ఛేంజర్” నుంచి మరో క్రేజీ అప్డేట్ కి టైం ఫిక్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ళు నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ రీసెంట్ గానే సినిమా సెకండ్ సింగిల్ ని రిలీజ్ కి తీసుకొస్తున్నట్టుగా వరుస అప్డేట్స్ ని మేకర్స్ అందిస్తూ వచ్చారు.

అయితే ఇప్పుడు మరో అప్డేట్ కి థమన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి సెకండ్ సింగిల్ పై మరో ట్రీట్ సిద్ధంగా ఉంది అంటూ తెలిపాడు. దీనితో ఈ అప్డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి మరో పోస్టర్ గాని ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తుండగా శ్రీకాంత్, సునీల్, రవిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version