అట్లీ, షారుఖ్ సినిమా గురించి షాకింగ్ అప్డేట్

Published on Sep 23, 2020 12:08 am IST

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా తన స్థాయికి తగ్గ సినిమా చేయలేకపోతున్నందున ఆలోచనలో పడిన షారుఖ్ లాంగ్ బ్రేక్ తీసుకుని చివరికి సౌత్ దర్శకులైతేనే మంచి మసాలా ఎంటెర్టైనర్ తీయగలరని భావించి అట్లీకి ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రం వచ్చే యేడాది నుండి మొదలయ్యే అవకాశాలున్నాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో షారుఖ్ డ్యూయల్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ వార్త తెలియడంతో షారుక్ అభిమానుల్లో ఒకింత షాక్ తో పాటు సినిమాపై ఆసక్తి రెట్టింపు అయింది.

ఈ రెండు పాత్రల్లో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా ఇంకొకటి క్రిమినల్ రోల్ అని తెలుస్తోంది.
మొదటిసారి షారుక్ ఒక సౌత్ నుండి యువ దర్శకుడితో సినిమా చేస్తుండటం, అందునా ద్విపాత్రాభినయం కావడంతో చిత్రం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నారు. ఈ చిత్రానికి ‘సంకీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అట్లీ అంటేనే యాక్షన్, కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన గత చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. కాబట్టి ఈ చిత్రం కూడ ఆ తరహాలోనే ఇంకాస్త భారీగా ఉంటుందట. చిత్రం హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లో సైతం విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం :

More