‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పై క్లారిటీ

‘హరిహర వీరమల్లు’ షూటింగ్ పై క్లారిటీ

Published on Jun 17, 2024 10:32 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రం నుంచి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఐతే, తాజాగా ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం పవన్ లైనప్ లో ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఉన్నాయి. అయినప్పటికీ, తన కాల్ షీట్స్ ను ముందుగా వీరమల్లు సినిమాకే పవన్ కేటాయిస్తున్నట్లు టాక్.

ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోండి అంటూ పవన్ నుంచి కబురు కూడా వచ్చిందట. ఈ సినిమా షూటింగ్ జూలై మొదటి వారంలో స్టార్ట్ కానుంది. ఇక ఈ ఏడాది చివర్లో ఈ సినిమా పార్ట్-1 ను రిలీజ్ చేసే విధంగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలకు వి.ఎఫ్.ఎక్స్, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.

కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పవన్ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు