ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కొత్త ప్రాజెక్ట్ ను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివక్రమ్ మరోసారి జత కట్టారు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా పాన్ వరల్డ్ చిత్రంగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే బన్నీ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, త్రివిక్రమ్ స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఐతే, భారత స్వాతంత్య్ర ఉద్యమం నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారట. కాగా డిసెంబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. టైటిల్ మరియు ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాము అని మేకర్స్ చెప్పుకొచ్చారు. హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ సంగీతం అదించబోతున్నాడు.