‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Oct 8, 2024 3:02 AM IST

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉంది. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య పాత్ర తాలూకు పరిచయ షాట్స్ ను తీస్తారట.

మొత్తానికి ఈ సినిమా కోసం బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు. కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు