‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

‘అఖండ 2’ పై లేటెస్ట్ అప్ డేట్

Published on Mar 12, 2024 6:05 PM IST

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో, ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? లాంటి విషయాల పై బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని టాక్ నడుస్తోంది. ‘అఖండ 2’లో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది.

అందుకే, ‘అఖండ 2’ సినిమా పై నార్త్ లో కూడా బజ్ ఉంటుందని టాక్. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు