మంచు విష్ణు తాజాగా చేస్తున్న సినిమా భక్త కన్నప్ప. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రం కోసం విష్ణు కఠినంగా కష్టపడుతున్నాడు. ఐతే, ప్రస్తుతం ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ శివుడి పాత్రతోనే స్టార్ట్ అవుతుంది అని టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ మహా శివునిగా కనిపించనున్నాడని.. అదే విధంగా పార్వతీ దేవిగా నయనతార కనిపించనుంది అని వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలు నిజం అయితే.. ఈ సెట్స్ లో ప్రభాస్ – నయనతార పై త్వరలోనే ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తారు.
అన్నట్టు భక్త కన్నప్పలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. ఆదివాసీ తెగకు సంబంధించిన ఒక పాత్రలో మోహన్‌లాల్ మెరవనున్నాడు. అలాగే, ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్ లు ఉంటాయట. ముఖ్యంగా చాలా మంది స్టార్స్ పేర్లు కూడా ఈ సినిమాలో యాడ్ కాబోతున్నాయి అని తెలుస్తుంది. రీసెంట్ గా బాలయ్య బాబు కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.