“భీమ్లా నాయక్” షూట్ పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jan 20, 2022 10:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు మాస్ ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తికాగా ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాలోని బ్యాలన్స్ షూట్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు దానికి మేకర్స్ చిన్న బ్రేక్ ఇచ్చారట. అలాగే ఈ తర్వాత షూట్ మళ్ళీ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది తెలుస్తుంది. ఈ వచ్చే జనవరి 25 నుంచి మళ్ళీ ఫ్రెష్ షెడ్యూల్ ని మేకర్స్ స్టార్ట్ చేయనున్నారట. ఇక దీనితో షూట్ అంతటినీ ఫిబ్రవరి నాటికి ముగించేసి అనుకున్న డేట్ కే అంటే ఫిబ్రవరి 25న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :