‘బిగ్‌బాస్‌ 8’ ముగింపుకి పోలీసుల భారీ బందోబస్తు !

‘బిగ్‌ బాస్‌ సీజన్‌-8’ తుది దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో ఈ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడబోతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన సీజన్‌ 8.. డిసెంబర్ 14వ తేదీతో ముగియబోతుంది. ఈ గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబరు 17న బిగ్‌బాస్‌ 7 విజేత అయిన పల్లవి ప్రశాంత్‌ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చే సమయంలో పరిస్థితి అదుపు తప్పింది. ఆ సమయంలో అభిమానుల కారణంగా ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా.. పోలీసులు ముందస్తుగా స్టూడియో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపుగా 300 మంది పోలీసులు స్టూడియో వద్ద చుట్టుపక్కల ఉండేలా చర్యలు తీసుకోబోతున్నారు. ఇక సీజన్‌ 8 విషయానికి వస్తే.. ఈ సీజన్ లో మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మెయిన్ కంటెస్టెంట్లు 14 మంది, వైల్డ్ కార్ట్ ఎంట్రీలతో 8 మంది షోలో పాల్గొన్నారు. ఐతే ప్రధాన పోటీ మాత్రం గౌతమ్‌, నిఖిల్‌ ల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది.

Exit mobile version