‘గేమ్ ఛేంజర్’ నెక్స్ట్ సాంగ్‌పై లేటెస్ట్ అప్డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’పై అంచనాలు ఏ రేంజ్‌లో నెలకొన్నాయో మనం చూస్తున్నాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా, పూర్తి పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అవ్వగా, వాటికి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది.

అయితే, ఈ సినిమా నుండి మూడో సాంగ్‌పై తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి, ఈ చిత్రంలో ఓ మెలోడి సాంగ్ ఉందని, అది మూడో పాటగా వస్తే తాను సంతోషిస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి మ్యూజిక్ ప్లాట్‌ఫామ్ వారు ఆల్రెడీ మేము ఈ పాట మాయలో పడిపోయామని.. ఈ పాటనే ఖచ్చితంగా నెక్స్ట్ వస్తుందని వారు అనౌన్స్ చేశారు. దీంతో రామజోగయ్య శాస్త్రి, ఈ పాట రిలీజ్ పై అప్డేట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు.

ఇక అక్టోబర్ నెల మెలోడి సాంగ్‌తో రెచ్చిపోదామని, ఈ పాట మాయలో పడిపోదామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version