పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కోసం అందరికి తెలిసిందే. మరి పవన్ కెరీర్ లో ఇదే మొదటి పాన్ ఇండియా అది కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమా కావడంతో అప్పట్లో భారీ హైప్ దీనిపై నెలకొంది.
ఇక ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ఓ ఇంట్రెస్టింగ్ టాక్ బయటకు వచ్చింది. పవన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ని పాడినట్టుగా తెలిపాము. మరి దీనిని రికార్డింగ్ అయితే చేయడం కానీ ఇప్పుడు ఈ సాంగ్ ని విజువల్ గా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనితో ఈ అక్టోబర్ 25న షూటింగ్ ని సాంగ్ పై ప్లాన్ చేస్తున్నారట. ఇది కంప్లీట్ అయ్యాక సాంగ్ ని దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ గా విడుదల చేస్తున్నట్టుగా తెలుస్తోంది.