కల్కి ఫీవర్ మొదలైపోయింది

కల్కి ఫీవర్ మొదలైపోయింది

Published on Jun 23, 2024 10:40 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌ లో రాబోతున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఈ వారం అంతా కల్కి.. కల్కి.. కల్కి నామ జపం చేయబోతున్నారు ప్రేక్షకులు. ఇప్పటికే, ఈ నెల 27న దాదాపు అన్ని సినిమా స్క్రీన్ లు కల్కి సినిమాతో నిండిపోనున్నాయి. మొత్తం మీద హైదరాబాద్ జంట నగరాల్లో కల్కి ఫీవర్ బాగా కనిపిస్తోంది. తొలి రోజు వసూళ్లు 20 కోట్ల వరకు వుంటాయని అంటున్నాయి.

ఎలాగూ ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కల్కి టికెట్ రేట్ల పెంపు విషయంలో, అలాగే స్పెషల్ షోల విషయంలో కూడా ఎలాంటి షరతులు ఉండవు. కాగా ఈ భారీ-బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి, రాజేంద్ర ప్రసాద్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు