ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి రీసెంట్ గానే తన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ తో “దేవర” అనే భారీ హిట్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఇక ఈ సినిమా కాకుండా కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న భారీ సినిమా ఇంకొకటి ఉంది. తన కెరీర్ 21వ సినిమాగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాలిడ్ యాక్షన్ ప్రొజెక్ట్ గా మంచి అంచనాలు సెట్ చేసుకుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది. మేకర్స్ ఓ కీలక షెడ్యూల్ కోసం వైజాగ్ కి షిఫ్ట్ అయ్యినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఇక్కడ కొన్ని ముఖ్యమైన సీక్వెన్స్ లను వారు తెరకెక్కించనున్నారట. మొత్తం 15 రోజులు పాటు సాగే ఈ షెడ్యూల్ లో సినిమా ప్రధాన తారాగణం నటించనున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.