వారి కోసం రాజమౌళి టెస్ట్‌ షూట్స్‌

వారి కోసం రాజమౌళి టెస్ట్‌ షూట్స్‌

Published on Jun 24, 2024 12:19 PM IST

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ పై ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ.. ‘ఈ వారమే స్టోరీ లాక్‌ అయిందని.. టెస్ట్‌ షూట్స్‌ జరుగుతున్నాయని.. జులై లేదా ఆగస్టులో మ్యూజిక్‌ వర్క్‌ స్టార్ట్‌ చేస్తా’’ అని చెప్పుకోచ్చారు. కాగా తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో నటించే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక పై ప్రస్తుతం రాజమౌళి ఫోకస్ పెట్టాడు అని, వారి కోసం ప్రస్తుతం టెస్ట్‌ షూట్స్‌ కూడా చేస్తున్నాడని తెలుస్తోంది.

అన్నట్టు టెస్ట్‌ షూట్స్‌ కోసం కేవలం తెలుగు నటీనటులనే కాకుండా, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను కూడా పిలుస్తున్నారట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక పూర్తి అయ్యాక, ప్రధాన పాత్రల పై జక్కన్న ఫోకస్ పెడతాడట. కాగా ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. మహేష్ కూడా సరికొత్త గెటప్ లో కనిపిస్తాడట. సూపర్ స్టైలిష్ గా హాలీవుడ్ హీరో రేంజ్ లో మహేష్ లుక్ ఉంటుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు