‘మహేష్ బాబు’ ద్విపాత్రాభినయం ?

‘మహేష్ బాబు’ ద్విపాత్రాభినయం ?

Published on Mar 12, 2024 6:56 AM IST


దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐతే, తాజాగా మరో కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, రాజమౌళి టీమ్ నుంచి ఇప్పటివరకూ మహేష్ బాబు పాత్రలకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఒకవేళ, మహేష్ రెండు పాత్రల వార్త నిజమైతే.. ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు ఈ సినిమా కనుల విందుగా ఉంటుంది. ఇక ఈ సినిమాలో మహేష్ చాలా ఇంటెన్స్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కాగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

కాగా ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది. ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాసే ప్రయత్నం చేశాను. కానీ రాజమౌళి మార్క్ స్క్రీన్ ప్లేనే ఉంటుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు