దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ పై చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. అయితే, అక్టోబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కొత్తగా టాక్ నడుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది.
అన్నట్టు ఓ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుందట. ఇక, ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ, ఈ వార్తలో ఎంత వాస్తవం ఉందో చూడాలి. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ స్మిత్ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది.