“విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్.!

“విశ్వంభర” పై లేటెస్ట్ అప్డేట్.!

Published on Jul 3, 2024 3:04 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్ లో 156వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా షూటింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ప్రస్తుతం చిరు అలాగే యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ నడుమ కొన్ని కీలక సన్నివేశాలని వశిష్ట తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో ఈ సీక్వెన్స్ సీన్ కీలకంగా మారుతుంది అని టాక్. ఇక ఈ భారీ సినిమాని విజువల్ వండర్ లా తెరకెక్కిస్తుండగా ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని తీసుకొస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు