ఎముకలు కొరికే చలిలో నాగర్జున సాహసాలు

Published on Oct 21, 2020 11:59 pm IST


కింగ్ నాగార్జున చేస్తున్న కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’. లాక్ డౌన్ వలన ఆగిపోయిన ఈ సినిమా షూట్ ఇటీవలే మొదలైంది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టే మనాలిలో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. నాగర్జున హైదరాబాద్ నుండి పంజాబ్ వెళ్లి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మనాలి వెళ్లారు. పూర్తిగా మంచుతో కప్పబడిన మనాలి లొకేషన్లలో చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ మంచు ప్రాంతంలోనే యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందిస్తున్నారు. చిత్రంలోని సహ నటుడు అలిరెజా తుపాకి పట్టుకుని మంచులో నిలబడి ఉన్న నాగార్జున ఫొటోలు షేర్ చేశారు.

ఇప్పటికే ఆలస్యం కావడంతో షూటింగ్ ముగించాలనే ఉద్దేశ్యంతో ఆ ఎముకలు కొరికే చలిలోనే 30 రోజుల పాటు మనాలి మంచులోనే చిత్రీకరణ జరపనున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఎన్ఐఏ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇది నాగర్జున గతంలో చేసిన యాక్షన్ చిత్రాలకంటే భిన్నంగా ఉంటుందట. ఇందులో సయామీ ఖేర్, దియా మీర్జాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టెయిన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More